కనిపించని దూరంలో ఉంటే
భరించలేకపోతున్నాను...
నా కన్నుల వెలుగులో
నిన్ను దాచేస్తాను...
గుండె గూటిలో కాపురం ఉంటాను వదలకుండా
నీతో ఉండొచ్చు...
నీ పెదవులపై చిరునవ్వుగా
చిరకాలం ఉంటాను...
నీ తలపులలో వలపులు మాలలు వేస్తాను...!!!
🌹పరవశించి రాధా!!
నీ ప్రణయ గీతం పాడనా...🌹కవిత 864పరవశించి రాధా!!నీ ప్రణయ గీతం పాడనా...నీకై తపించి జపించిఅనుక్షణం నీ ధ్యాసలోనే లీనమై పోతున్న...నీ విరహంలో నీకైఎదురు చూసేనా కన్నులకునీ చుట్టూ తిరిగేనా మనసుకి అడుగు...నీ కృష్ణుడు మనసంతానీ పై ఆరాధనలే...తనువంతా నీ స్పర్శ కోసంఎదురుచూపులు...నీ ముద్దు మాటలునీ అల్లరి చూపులుచెరగని ముద్రలు మదిలో...నీవు లేని నేను లేను రాధ.మన ఇరువురి ప్రేమతేనెల మాధుర్యం...నీ ప్రేమ దాసుడినికరుణించి కనికరించిదరిచేరవా రాధా...ఈ ఒంటరితనం నన్నువేధిస్తోంది....నీవు లేని వెన్నెలవేడిగా ఉంది...నీ అడుగులు మువ్వలసవ్వడి వినిపించవే...ననుచేరి మురిపించవేనీ ప్రేమ లాలనలో...ఎక్కడ దొరకని ఆనందంనీ సమక్షంలో ప్రేమ కెరటాలైనన్ను ముంచేస్తాయితన్మయత్వంలో...కలహాలు విరహాలుమురిపాలు సగపాలుచేయవే నా దరిచేరవే...పరువాల బొమ్మపసిడి కొమ్మ రాధమ్మ...
నీ చూపులో మాయ ఉందో...!
నా ఆశ. , శ్వాస నువ్వే.... అయ్యావు.
కనురెప్పలు కదిల్చితే నీ రూపం
చెరిగిపోతుందేమోనని భయం భయం.
==================
పక్కన ఎవరు లేనప్పుడు.....
ఎవరో ఒకరి జ్ఞాపకం!!!!
నిన్ను తోచనివ్వదు......
నిన్ను ఏ పనీ చేయ్యనివ్వదు!!!!
వాళ్ళే అన్ని విధాల కావాలసిన......
వాళ్ళు అవుతారు!!!!!
==================\
కనిపించని దూరంలో ఉంటే
భరించలేకపోతున్నాను...
నా కన్నుల వెలుగులో
నిన్ను దాచేస్తాను...
గుండె గూటిలో గువ్వలా
కాపురం ఉంటాను...
ప్రతి క్షణం నీతో కలసి
జీవించవచ్చు...
నీ పెదవులపై చిరునవ్వుగా
చిరకాలం ఉంటాను...
నీ తలపులలో వలపులు
మాలలు వేస్తాను...
==================
నీ కళ్ళల్లో ఏదో మత్తు
నన్ను చుట్టేసింది...
నీ శ్వాసలో నా ప్రాణం
చిక్కుకుంది...
మనసంతా మాయలో
ముంచేసింది...
నీ ప్రేమ వలవేసి
బంధించేశావు...
నీ తోడు లేని నేను
జీవించలేను...
నీతో మరణమైనా
మనసారా ఆహ్వానిస్తా..
0 comments:
Post a Comment