INCREDIBLE PSYCHE

Incredible Psyche is intended to serve all the people associated with the Web and Internet with all updates which includes National, International, Sports, Entertainment, Science and Technology and Health. Stay tuned to be updated with all trending stories.

  • 24/7 News Updates
  • Beauty Tips
  • Advertise
  • HOME
  • NATIONAL
  • INTERNATIONAL
  • BUSINESS
  • SPORTS
  • ENTERTAINMENT
  • SCI-TECH
  • HEALTH
  • EDUCATION
    • JOBS UPDATES
    • EXAM RESULTS
    • ADMISSIONS
    • STUDY MATERIALS
      • IAS/IPS/GROUP I/II
      • BANKING MATERIAL IBPS
      • UPSC/SSC
      • APTITUDE
  • WISE WORDS

గోదావరి మహాపుష్కరాల 2015 సాంస్కృతిక కార్యక్రమాలు, పుష్కర స్నానఘట్టాలు | నదీతీరంలోని గ్రామాలు / ఆలయ పట్టణాలు

By Incredible Psyche in: NATIONAL Telangana Telugu Moral Stories Travel WISE WORDS
పన్నెండు రోజుల గోదావరి మహాపుష్కరాల సంభరానికి తెలంగాణ సన్నద్ధమైంది. రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో తీరం పొడవునా ఉన్న క్షేత్రాలు, తీర్థాలన్నీ శోభాయమానంగా ముస్తాబయ్యాయి. శతాబ్దానికి ఒకసారి మాత్రమే వచ్చే.. మానవ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే ఈ అరుదైన మహాపుష్కరాల శుభఘడియల్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సమస్త తెలంగాణ ఉవ్విళ్లూరుతున్నది.
Telangana Godavari Pushakaralu  Pushkar Ghats in Karimnagar, Adilabad, Warangal, Khammam, Nizamabad, Helpline Number

50 లక్షల తీర్థాలన్నీ మిళితం చేసుకుని, ముక్కోటి దేవతలను తనలో ఆవాహన చేసుకున్న గోదావరి పుష్కరాలకు, ధర్మపురి మహాక్షేత్రంలో ఏడుగురు పీఠాధిపతులు మంగళవారం ఉదయం వేదసూక్తాలతో స్నానమాచరించి అంకురార్పణ చేయనున్నారు. ఇక్కడే ఉదయం 6.26 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గోదావరిలో స్నానం చేసి మహాపుష్కరాలను ప్రారంభించనున్నారు. కోట్ల సంఖ్యలో భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం ఘనమైన ఏర్పాట్లు చేసింది. 106 పుష్కరఘాట్లు ఇప్పటికే రూపుదిద్దుకున్నాయి. 

స్నానాలకు షవర్లు, దుస్తులు మార్చుకునే తాత్కాలిక గదులతో పాటు వైద్యం, ఆహారంవంటి ఏర్పాట్లన్నీ సిద్ధం చేశారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల నుంచి నీరు విడుదల చేయడంతో గోదావరి వరద ప్రవాహంతో ఉరకలెత్తుతున్నది. వివిధ రాష్ర్టాలనుంచి పుణ్యస్నానాల కోసం తరలివస్తున్న ప్రజలతో గోదావరి తీర క్షేత్రాలన్నీ కళకళలాడుతున్నాయి.
యతీంద్రస్నానంతో.. : మంగళవారం ఉదయం గోదావరి మహాపుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 6.26 గంటలకు గోదావరిలో పవిత్ర పుష్కర స్నానం ఆచరించి మహాపుష్కరాలను ఘనంగా ప్రారంభిస్తారు. అంతకన్నా ముందుగా వేదప్రమాణాల ప్రకారం, పరాశరస్మృతి, నిర్ణయసింధు వంటి సద్గ్రంథాలు నిర్ణయించిన మార్గదర్శకాల ప్రకారం పాంచరాత్ర ఆగమసూక్తాలతో శ్రీవైష్ణవ క్షేత్రాల దేవతామూర్తులకు, శైవాగమసూక్తాలతో శైవక్షేత్రాలలో దేవతామూర్తులకు స్నపనం చేస్తారు.
మహా హారతులిచ్చి పుష్కరుడికి స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత వేదసూక్తాలతో యతీంద్రులు స్నానమాచరిస్తారు. ఈ స్నానంలో పుష్పగిరిపీఠాధిపతి శ్రీ విద్యాభారతినృసింహస్వామి, విశాఖశారదాపీఠం శ్రీ స్వరూపానందేంద్రస్వామి, మంత్రాలయం శ్రీ సుబుధేంద్రస్వామి, హంపీపీఠం శ్రీ విరూపాక్షస్వామి, ధర్మపురి స్వామి తదితర స్వాములు పాల్గొంటున్నారు. ఆ వెంటనే మహాసంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ధర్మపురిలో గోదావరి పుష్కర పవిత్రస్నానం ఆచరిస్తారు. దీనితో మహాపుష్కరాలు ప్రారంభమవుతాయి. 1872 నుంచి వస్తున్న గణనాల ప్రకారం 144వ సంవత్సరంలో గోదావరికి పుష్కరాలు వచ్చినందున జ్యోతిష్యులు, వేదపండితులు, సిద్ధాంతులు, పంచాంగకర్తలు ఈ పుష్కరాలను మహాపుష్కరాలుగా అభివర్ణించారు.

ధర్మపురి చేరిన ముఖ్యమంత్రి:

ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రమే ధర్మపురికి చేరుకున్నారు. ఆయన మంగళవారం ఉదయం దేవాలయం నుంచి మంగళవాయిద్యాలతో వేద మంత్రోచ్ఛారణల మధ్య గోదావరి వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. పుష్కరాలను అధికారికంగా ప్రారంభించి, అక్కడి నుంచి లక్ష్మీనృసింహ స్వామి ఆలయానికి వచ్చి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ధర్మపురి పుణ్యక్షేత్రం పరిధిలో భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరుపుతారు.
ముఖ్యమంత్రితో కలిసి పుష్కరాలను ప్రారంభించేందుకు ఏడుగురు పీఠాధిపతులు కూడా సోమవారం ధర్మపురికి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో ధర్మపురి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ తదితరులు ఘనస్వాగతం పలికారు. సీఎం హరిత హోటల్‌లో బస చేశారు.

దేశమంతా ఇటువైపే..

నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి గోదావరి పుష్కరాలు రావడంతో రాష్ట్రప్రభుత్వం కుంభమేళాను తలపించే విధంగా రూ.600 కోట్ల వ్యయంతో భారీ ఏర్పాట్లు చేసింది. సుమారు 106 స్నానఘట్టాలను ఏర్పరిచింది. జనవరి నెలనుంచే పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నం కావడంతో పాటు దేశంలోని వివిధ పీఠాధిపతులను పుష్కరాలకు ఆహ్వానించింది. పుష్కరాల నిర్వహణకు వారి సలహాలను స్వీకరించింది.
ప్రభుత్వ కృషి, ప్రచారం ఫలితంగా దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజల దృష్టి తెలంగాణవైపు మళ్లింది. తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు తెలంగాణతో కనెక్టివిటీ ఉండడంతో ఎక్కువమంది తెలంగాణలో పుణ్యస్నానాలకు మొగ్గు చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తొలినుంచి పుష్కరాలకు కేంద్రంగా ఉంటున్నా గోదావరి తీరంలో అక్కడ పెద్దగా ప్రాధాన్యం కలిగిన ఆలయాలు లేవు. దానికి భిన్నంగా తెలంగాణలో బాసరలో అరుదైన సరస్వతి ఆలయం ఉన్నది. ధర్మపురి నవనారసింహ క్షేత్రం. కాళేశ్వరంలో అరుదైన రెండు లింగాల ఆలయం ఉంది. వీటితోపాటు రామాయణ కాలంతో ముడిపడ్డ సుప్రసిద్ధ భద్రాచలం ఆలయం సైతం తెలంగాణలో ఉండడంతో ఇతర రాష్ర్టాల వారు ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ సంఖ్యలో తెలంగాణలో పుష్కరస్నానం కోసం వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరిలో పెరిగిన ప్రవాహం :

ఆదివారం వరకు నీటిఎద్దడి ఉన్న కందకుర్తి, బాసరలలో సోమవారం గోదావరి పరుగులు ప్రారంభమయ్యాయి. ఆరు నుంచి ఎనిమిదికోట్ల మంది పుష్కరస్నానం చేస్తారనే అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతస్థాయిలో ఏర్పాట్లు చేసింది. పుష్కరాలకోసం టీఎస్‌ఆర్టీసీ 2300 బస్సులను ఏర్పాటు చేసింది. సోమవారం మధ్యాహ్నం నుంచే పుష్కరాల బస్సులు పరుగులు ప్రారంభించాయి. దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది.

రెండు వాణిజ్య హెలికాప్టర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. భద్రాచలం, ధర్మపురి, కాళేశ్వరం, బాసరలకు హెలికాప్టర్‌లో వెళ్లాలనుకునే వారికి వీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు. భక్తుల రక్షణ కోసం 20వేల మంది పోలీసులను నియమించారు. స్నాన ఘట్టాలు సహా పుష్కర ప్రాంతాల్లో సీసీటీవీలు, షీటీమ్‌లను ఏర్పాటు చేశారు. షవర్‌లు, నల్లాలు ఏర్పాటు చేశారు. వందలసంఖ్యలో దుస్తుల మార్పిడి గదులు, మరుగుదొడ్లు సిద్ధమయ్యాయి. పుష్కరఘాట్‌వద్ద గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచారు. స్నానానికి దిగేవారు లోతులోకి పోకుండా బ్యారికేడ్లు కట్టారు. నిరంతర విద్యుత్తు సరఫరా, మంచినీటి సరఫరా ఏర్పాట్లు జరిగాయి. అన్నీ క్షేత్రాలలో వివిధ సంస్థలు అన్నసత్రాలను ఏర్పాటు చేశాయి. బాసరలో సింగరేణి సంస్థ, భద్రాచలంలో ఐటీసీ ప్రత్యేక సదుపాయాలను కల్పిస్తున్నది.

సాంస్కృతిక కార్యక్రమాలు..

పుష్కరాలు జరిగే పన్నెండురోజులు తీర పుణ్యక్షేత్రాల్లో ఉదయం నాదస్వర సంకీర్తనలతో పుష్కర హారతులతో కార్యక్రమాలు ప్రారంభమయ్యేలా సాంస్కృతిక కార్యక్రమాలను దేవాదాయశాఖ రూపొందించింది. భక్తిసంగీతం, భజనలు, కోలాటాలు, సాయంత్రం ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి.

భద్రాచలంలో ఊంజల్‌సేవ, సహస్రనామార్చన, శీఘ్రదర్శనం టికెట్‌లకు ఆన్‌లైన్ సౌకర్యాలను కల్పించారు. పుష్కరాలు జరిగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుంది. భక్తులుwww.bhadrachalam.co.in లేదా www.badrachalam.co.in వెబ్‌సైట్ ద్వారా సేవా టిక్కెట్లను పొందవచ్చని రాష్ట్ర దేవాదాయశాఖ అధికారులు పేర్కొన్నారు. దేవాదాయశాఖ కమిషనరేట్‌లో కంట్రోల్‌రూం ఏర్పాటు చేశారు. ఇతర వివరాల కోసం 040-24755522, 040-24750102, 040-24758285, 7794014301, 7794014302, 7794014304, 7794014329, 7794014332 ఫోన్ నంబర్లు ఏర్పాటు చేశారు. ప్రతి పుష్కరఘాట్‌లో టోల్‌ఫ్రీ నంబర్లను అందుబాటులో ఉంచారు. రాష్ట్ర సమాచారశాఖ మీడియా సెంటర్లను ఏర్పాటు చేసింది.

భక్తులకు ఇబ్బందులు రావొద్దు

పుష్కరాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై సీఎం ధర్మపురిలో సమీక్ష నిర్వహించారు. దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, దేవాదాయశాఖ కమిషనర్ శివశంకర్, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, కలెక్టర్ నీతూ ప్రసాద్, డీఐజీ మల్లారెడ్డి, ఎన్‌పీడీసీఎల్ సీఎండీ వెంకటనారాయణ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. కడెం, పోచంపాడు ప్రాజెక్టుల నుంచి వదిలిన నీరు పుష్కరఘాట్ల వద్దకు చేరుకున్నదని అధికారులు సీఎంకు ఈ సందర్భంగా వివరించారు.

బాసరలో కూడా కొంత మేర నీరు నిలువ ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ పుష్కర ఘాట్ల వద్ద రహదారులు, పార్కింగ్ సక్రమంగా నిర్వహించాలని, విద్యుత్ సరఫరా, బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ ద్వారా నీళ్లు నిరంతరం అందించాలని ఆదేశించారు.
ఎవరు.. ఎక్కడ..

పరమహంస పరివ్రాజకులు శ్రీమన్నారాయణ చినజీయర్‌స్వామి భద్రాచలంలో యతీంద్రస్నానం చేసి అనుగ్రహభాషణం చేస్తారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, హరీశ్‌రావు గోదావరి పుష్కర స్నానం చేస్తారు. మంత్రులు కే తారకరామారావు, జోగు రామన్న బాసరలో స్నానం చేస్తారు. మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పోచంపాడ్‌లో, చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్ సీఎంతోపాటు ధర్మపురిలో పుణ్యస్నానం చేస్తారు. ఎంపీ కవిత పోచంపాడ్‌లో, మంత్రులు జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ కాళేశ్వరంలో స్నానం చేస్తారు.

Godavari Pushkaralu 2015 Pushkar Ghats in Karimnagar, Adilabad, Warangal, Khammam, Nizamabad, Helpline Number



పుష్కర స్నానఘట్టాలు: -నదీతీరంలోని గ్రామాలు / ఆలయ పట్టణాలు

నిజామాబాద్ జిల్లా:
  • కందకుర్తి త్రివేణి సంగమం, శివాలయం (రేంజాల్ మం॥)
  • కోస్లి హనుమాన్ టెంపుల్ (నవీపేట్ మం॥)
  • థాడ్బిలోలి శివాలయం, హనుమాన్ టెంపుల్ (రేంజాల్ మం॥)
  • బినోలా గౌతమేశ్వరస్వామి ఆలయం (నవీపేట్ మం॥)
  • తుంగిని హనుమాన్ టెంపుల్(నవీపేట్ మం॥)
  • తాడ్‌పాకల్ (మోర్తాడ్ మం॥)
  • ఉమ్మెడ (నందిపేట్ మం॥)
  • పోచంపాడు ఎస్‌ఆర్‌ఎస్‌పి క్యాంప్ కాలనీ(బాల్‌కొండ మం॥)

ఆదిలాబాద్ జిల్లా:



  • బాసర (ముధోల్ మం॥)
  • వస్తాపూర్ (లోకేశ్వరం మం॥)
  • సోవాన్ (నిర్మల్ మం॥)
  • ఖానాపూర్ (గ్రా, మం॥)
  • చింతగూడ (జన్నారం మం॥)
  • సీతారాంపల్లి, ముల్కాల (మంచిర్యాల మం॥)
  • లక్సెట్టిపేట (గ్రా, మం॥)
  • గూడెం (దండేపల్లి మం॥)
  • వెల్లాల (జైపూర్ మం॥)
  • చెన్నూర్ (గ్రా, మం॥)
  • చింతలచాంద (లక్ష్మణచాంద మం॥)
  • పీచర హన్మాన్ టెంపుల్ (లక్ష్మణచాంద మం॥)
  • సాంగ్వి (దిల్వాపూర్ మం॥)
  • పోంకల్ నాగులమ్మ టెంపుల్ (మంమ్దా మం॥)
  • ద్వారక (దండేపల్లి (మం॥)
  • తింబరేణి (దిల్వార్‌పూర్ మం॥)
  • కామల్‌కోట్ బ్రిడ్జి (మాంమ్దా మం॥)
  • ఆస్తా (ముధోల్ మం॥)

కరీంనగర్ జిల్లా:

  • ధర్మపురి ప్రధాన ఘాట్,సంతోషిమాత ఆలయం వద్ద
  • ధర్మపురి ప్రధాన ఘాట్, మంగటిగడ్డ సోమవిహార్, ఘాట్-2
  • ధర్మపురి మహాలక్ష్మి దేవాలయం
  • తిమ్మాపూర్ (ధర్మపురి మం॥)
  • కాళేశ్వరం (మహదేవపూర్ మం॥)
  • కోటిలింగాల (వెలగటూరు మం॥)
  • మంథని (గ్రా, మం॥)
  • ఈర్ధాని (ఇబ్రహీంపట్నం మం॥)
  • వెల్గొండ రామాలయం (మల్లాపూర్ మం॥)
  • వెల్గొండ హనుమాన్ దేవాలయం వద్ద(మల్లాపూర్ మం॥)
  • వేంపల్లి వెంకట్రావుపేట హనుమాన్ టెంపుల్, గంగమ్మ గుడి ముందుభాగం (మల్లాపూర్ మం॥)
  • బోర్నపల్లి రామాలయం (రాయికల్ మం॥)
  • కమ్మనూర్ (సారంగపూర్ మం॥)
  • వేములకుర్తి (ఇబ్రహీంపట్నం మం॥)
  • కోమటి కొండాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
  • ఫకీర్ కొండాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
  • మూలరాంపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
  • రత్నాలమడుగు వేములకుర్తి, యానాపూర్ (ఇబ్రహీంపట్నం మం॥)
  • మొగిలిపేట (మల్లాపూర్ మం॥)
  • ఓబులాపూర్ (మల్లాపూర్ మం॥)
  • కొత్త ధర్మాజిపల్లి (మల్లాపూర్ మం॥)
  • పాత ధర్మాజిపల్లి (మల్లాపూర్ మం॥)

వరంగల్ జిల్లా:

  • మల్లకట్ట (ఏటూర్ నాగారం మం॥)
  • రామన్నగూడెం (ఏటూర్ నాగారం మం॥)
  • మంగపేట్ (గ్రా, మం॥)

ఖమ్మం జిల్లా:

  • భద్రాచలం (గ్రా, మం॥)
  • భద్రాచలం విస్టా కాంప్టెక్స్
  • భద్రాచలం రామఘాట్, పర్ణశాల (దుమ్ముగూడెం మం॥)
  • భద్రాచలం సీతాఘాట్, పర్ణశాల(దుమ్ముగూడెం మం॥)
  • రామచంద్రాపురం ఆంజనేయస్వామి దేవాలయం వద్ద(వెంకటాపురం మం॥)
  • చిన్నరాయిగూడెం శివాలయం, ఆర్‌హెచ్‌ఎస్ (మునుగూరు మం॥).
Comments and suggestions are always received and acknowledged from every reader so the content and above cited information could be made more robust.
Stay tuned with me for more sensible updates of Godavari Pushkaralu, Godavari Pushkaralu Ghats, Godavari Pushkaralu helpline numbers, Tourist Attractions, Temples, Heritage Spots, Nature Retreats, Transportation and additional information regarding the Godavari Pushkaralu in Telangana and Andhra Pradesh.


About Incredible Psyche Author

R P K RATHOD is the founder and Publisher ofIncredible Psyche, a non profit blog which lays emphasis on social issues and is dedicated for the humankind. Follow me up Facebook or you can connect with me on Twitter @RPKRATHOD, Follow me on Google Plus

Email: incrediblepsyche@gmail.com Services

0 comments:

Post a Comment

Newer Post Older Post Home

Popular Posts

  • Link Voter ID Card With Aadhaar Card Through Online, Mobile Phone Tollfree Call, SMS, Election Commision of India (ECI) App
    Online Seeding of Voter ID Card with Aadhaar Card Using Mobilephone Tollfree Call, SMS Service Under National Electoral Roll Purification an...
  • Telangana Godavari Pushkaram Maha Pushkaralu 2015 TSRTC Special Buses Timings Schedule List Details
    Telangana State Government is organizing Godavari Pushkaralu on a grand and unprecedented scale from 14-25 July, 2015. All the basic lux...
  • Happy International Women's Day Wishes, Messages, Greetings and HD Wallpapers
    Incredible Psyche blog, wishes you a very Happy International Women's Day. Wish your dear ones, mother, lady love, sister,  wife, gr...
  • Download WhatsApp Free Calling Feature for Andriod, iPhone, BlackBerry, Nokia S60, Nokia S40, Windows Phones
    Hey fellas. How is it going with your WhatsApp? Tired  of shelling out your earnings clearing huge telephone bills? Let me get you out of ...
  • Telangana TSPSC Government Jobs Recruitment of 15000 Posts in 15 Govt. Departments for 2015
    Good news for Telangana state unemployed state government jobs seeking as the Cheif Minister KCR has nodded and approved the recruitment o...
  • Telangana TSPSC Telugu Group II Services Exam Syllabus 2015, Subjects Paper Pattern, Detailed Notification Analysis [TELUGU]
    Telangana State Public Service Commi s sion (TSPSC) has released the state group 1, 2, 3, 4, gazetted and  non-gazetted  services syllabus...
  • Telangana Govts Jobs - TSPSC One Time Registration Process at Official Website- www.tspsc.gov.in
    Telangana State Government has launched a new online process to register the unemployed govt jobs seeking aspirants in various departments...
  • Telangana TSPSC Telugu Group I Services Exam Syllabus 2015, Subjects Paper Pattern, Detailed Notification Analysis [TELUGU]
    Telangana State Public Service Commi s sion (TSPSC) has released the state group 1, 2, 3, 4, gazetted and non-gazetted services syllabus,...
  • All India Radio: Get AIR Free News Updates as SMS/Message Service in 16 Languages English in Smartmobiles
    All India Radio is India's National Broadcaster and has been one of the leading Public Service Broadcaster under the Ministry of Info...

Translate

About Incredible Psyche

Incredible Psyche Blog is all about the news feeds and updates of all sorts of stuff across the globe. Incredible Psyche is intended to serve and update all the people have their presences on web/internet with all updates which includes National, International, Sports, Entertainment, Science and Technology and Health. Stay tuned to be updated with all trending stories. You can check out about the admin of the blog here and check out our Sitemap.

Quick Navigation

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Don't Click Here to Get Fooled

Featured Content

  • Videos
  • DMCA.com Protection Status

"© Copyright 2015" Incredible Psyche · All Rights Reserved · And Our Sitemap · All Logos & Trademark Belongs To Their Respective Owners·
Template Developed By www.alltechmedia.org & Powered By www.incrediblepsyche.net